పేదింటి విద్యార్థిని చదువుకు తెలంగాణ జాగృతి అండ

హైదరాబాద్, బతుకమ్మ : పేదింటి విశ్వకర్మ కార్మిక కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా నిలిచింది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన శామీర్ పేట నరేంద్రాచారి, స్వప్న దంపతుల కుమార్తె ఆశ్రిత మల్లారెడ్డి టెక్నికల్ క్యాంపస్ లో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించారు. రెక్కల కష్టంపై బతికే నరేంద్రాచారి హఠాన్మరణం పాలవడంతో బిడ్డ చదువు అగమ్యగోచరంగా మారింది. విద్యార్థిని తల్లి స్వప్నకు కుమార్తె కాలేజీ ఫీజు చెల్లించడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో విశ్వకర్మ టీవీ చానల్ నిర్వాహకుడు నర్సింహా చారిని...