26న తెలంగాణ జాగృతి ‘‘లీడర్’’ శిక్షణ ప్రారంభం
కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో శిక్షణ తరగతులు యువత, మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా శిక్షణ తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 26న (శనివారం) ‘‘లీడర్’’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి కీలక ఉపన్యాసంతో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, బహుజనులను...