కొనసాగిన బాలికల హవా
హైదరాబాద్, బతుకమ్మ : ఇంటర్మీడియేట్ ఫస్టియిర్, సెకండియర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలను 9.97 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఇంటర్ సెకండియర్లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్లో 66.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలికలు హవా కొనసాగింది.