తెలంగాణ ధాన్యానికి మంచి పేరుంది
కామారెడ్డి, బతుకమ్మ: తెలంగాణలో పండించే ధాన్యానికి మన దేశంలోని వివిధ రాష్ర్టాలతోపాటు విదేశాల్లో మంచి పేరుందని సివిల్ సప్లై శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డీఎస్ చౌహాన్ అన్నారు. కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మిల్లర్లు గతంలో ఇచ్చిన సీఎంఆర్ ఆధారంగా ధాన్యం కేటాయిస్తున్నామని, ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని మిల్లర్లకు సూచించారు. ఆరబోసిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, పూర్తిస్థాయిలో కోతకు వచ్చిన తరువాతే పంటను కోయాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో కాంటా అయిన...