స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం..?
హైదరాబాద్, బతుకమ్మ : కోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువులోపు అంటే ఈ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తూండటంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయింది. రిజర్వేషన్ల అంశం ఇంకా తేలనుందున మరింత గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లపై బిల్లు ఆమోదించామని అది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే తెలంగాణలో అన్ని స్థానిక సంస్థల గడువు ముగిసిపోయింది. ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికల...