ఐడీపీఎల్‌ భూములపై విచారణకు  తెలంగాణ సర్కార్‌ ఆదేశం

హైదరాబాద్, బతుకమ్మ :  ఐడీపీఎల్‌ భూములపై  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన ఈభూములపై విజిలెన్స్‌ విచారణకు మంగళవారం ఆదేశించింది.  గత కొన్నిరోజులుగా కూకట్‌పల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత మధ్య ఈ భూములకు సంబంధించి పరస్పర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే.  కూకట్ పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376 లో అసలు ఏం జరిగిందో లెక్కలు తేల్చి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది....