హైదరాబాద్, బతుకమ్మ : ఐడీపీఎల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన ఈభూములపై విజిలెన్స్ విచారణకు మంగళవారం ఆదేశించింది. గత కొన్నిరోజులుగా కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత మధ్య ఈ భూములకు సంబంధించి పరస్పర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. కూకట్ పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376 లో అసలు ఏం జరిగిందో లెక్కలు తేల్చి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. విజిలెన్స్ విచారణలో మరిన్ని అక్రమాలు బయట పడనున్నట్లు తెలుస్తోంది.