ఏపీ పర్యటనకు బయలుదేరిన తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ

  హైదరబాద్, బతుకమ్మ :   గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పన కొరకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడకు అధికారిక పర్యటనకు బయలుదేరింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ఆధ్వర్యంలో బయలుదేరిన బృందం గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం పై అధ్యయనం చేయనుంది. సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు....