Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 December 2024, 6:50 pm Posted by : ramakrishna

ఆరు గ్యారంటీల అమలులో తెలంగాణ సర్కారు విఫలం

బాన్సువాడ , బతుకమ్మ  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని బీజేపీ నాయకులు అన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ. 2,500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు స్కూటీ తదితర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణాధ్యక్షుడు ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి హన్మాండ్లు, బీర్కూరు మండల అధ్యక్షుడు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.