- బాలికల కళాశాలలో అంబరాన్ని తాకిన బతుకమ్మ సంబరాలు
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : తెలంగాణ అస్తిత్వం అంటేనే బతుకమ్మ అని, బతుకమ్మ శరన్నవరాత్రులలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతుందని నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ అన్నారు. శనివారం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలను కళాశాల సెలవులకు ముందు రోజు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. కళాశాలలో మొదటి సారిగా బతుకమ్మ, ముగ్గుల పోటీ, మెహందీ పోటీలను నిర్వహించడం పట్ల విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ ప్రాశస్త్యాన్ని, ప్రతిరోజు సంప్రదాయంగా నిర్వహిచే యెంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెబూతు ప్రభుత్వ బాలికల కళాశాల లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. కళాశాల బాలికలలో చైతన్యాన్ని నింపే విధంగా ప్రోత్సహించడం పట్ల విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. కళాశాలలోని బాలికలు, మహిళా అధ్యాపకులు బతుకమ్మలను పేర్చగా, ప్రిన్సిపాల్ బుధ్ధిరాజ్ స్వయంగా బతుకమ్మ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మతాలకతీతంగా విద్యార్థినులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం వరకు సంబరాలు, ఆటపాటలను నిర్వహించి గాజులపేట్ లోని రఘునాథలయం సమీపంలోని రఘునాథ్ (బొడ్డెమ్మ) చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. కళాశాలలో నిర్వహించిన రంగోలి, మెహందీ పోటీలలో మొదటి, రెండవ బహుమతులను మలబార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులు బహుమతులు అందజేశారు.