Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 6:19 pm Posted by : ramakrishna

కానిస్టేబుల్  సౌమ్య మృతి పట్ల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నివాళ్ళు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

విధి నిర్వహణలో అసమాన పోరాటం ప్రదర్శించి గంజాయి స్మగ్లర్లను పట్టుకునే సమయంలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల చింతిస్తూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నట్టు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు కెంపుల నాగరాజు, రేవంత్ తెలిపారు. సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లపై, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా ఖాకీ యూనిఫాం ఉద్యోగులపై దాడులు, హత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్ల కిందట ఫారెస్ట్ అధికారి గంగారం, కొన్ని రోజుల కిందట పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్, ఇప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య విధి నిర్వహణలో ప్రాణాలు వదలడం ఆందోళనకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

 

 

Telangana Employees Association condoles the death of Constable Soumya