హైదరాబాద్, బతుకమ్మ : కమర్షియల్ టాక్స్ స్కాంలో తెలంగాణ సీఐడీ దూకుడు పెంచింది. యాప్స్, మాడ్యూల్స్ తయారీలో రిసోర్స్ పర్సన్స్ గా ఉన్న అధికారులపై ఫోకస్ చేసింది. ఇప్పటికే 30 మందిని సీఐడీ విచారించింది. నాటి సీఎస్ సోమేష్ కుమార్ ఈ కేసులో నిందితుడుగా ఉన్నారు. కొందరు డీలర్స్ ఎలాంటి వస్తువులు కొనకున్నా నకిలీ బిల్లులతో ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పొందినట్లు గుర్తించారు. 75 కంపెనీల్లో ఇప్పటివరకు 40 కంపెనీల డేటాను సేకరించారు. ఐటీసీ పేరుతో పేరుతో రూ.1400 కోట్ల ప్రజాధనాన్ని కంపెనీలు లూటీ చేశాయి. నాటి సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలతో నలుగురు వ్యక్తులు డేటా కనపడకుండా చేశారు.