Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 5:57 pm Posted by : ramakrishna

కేసీఆర్ కు పట్టిన గతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దీన్ కు పట్టడం ఖాయం

 

. . . కామారెడ్డి జిల్లాలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది

 

. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గతంలో సీఎం కేసీఆర్ హిందువులపై అవమానించే విధంగా హిందుగాళ్లు బొందు గాళ్లు అంటే తెలంగాణ ప్రజలు ఆయనను బొంద పెట్టారని ఆయనకు పట్టిన గతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టడం ఖాయమని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం కామారెడ్డి నుండి బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యే ని గాంధారి క్రాస్ రోడ్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవి దేవతల మీద ప్రమాణం చేసి గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాలపై, దేవతలపై, హిందూ మహిళలపై దాడులు జరగడం అరాచకమని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజానికి పరాకాష్ట అని విమర్శించారు.

 

Telangana Chief Minister Revanth Uddin is sure to suffer the same fate as KCR.

మన మున్సిపల్ ఎన్నికల తర్వాత కామారెడ్డిలో తమ ఎమ్మెల్యే పై దాడులు, బాన్సువాడ పట్టణంలో హిందూ మహిళపై దాడి ఘటన, ఓల్డ్ సిటీలో హనుమాన్ ఆలయం పై దాడి ఘటన చూస్తుంటే హిందువులందరూ కాంగ్రెస్ పార్టీపై విసిగిపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ రెడ్డి గా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పడమే కాకుండా తనను రేవంత్ ఉద్దీన్ అని పలకమని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఇకపై ఇలానే హిందూ దేవతలపై, హిందూ ఆలయాలపై, హిందూ ప్రజలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని రేవంత్ సర్కార్ కి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

 

Telangana Chief Minister Revanth Uddin is sure to suffer the same fate as KCR.