ఇకపై పేపర్‌లెస్ విధానంలో తెలంగాణ మంత్రిమండలి సమావేశాలు

  హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలను ఇకపై పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రిమండలి సమావేశాలను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం “తెలంగాణ డిజిటల్ కేబినెట్” విధానాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో...