Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 10:43 am Posted by : ramakrishna

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ , మండలి సమావేశాలు

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. నాలుగైదు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.  ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి పై మండలి లో సంతాప తీర్మానాలు  ప్రవేశపెట్టి నివాళులు అర్పిస్తారు. తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు వాయిదా పడతాయి. అసెంబ్లీ, మండలిలో వేరువేరుగా నిర్వహించే బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజులపాటు సభ నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు.