ఉత్తమ మహిళా ఉద్యోగినిగా తేజస్విని
కామారెడ్డి, బతుకమ్మ: ఉత్తమ మహిళా ఉద్యోగినిగా తేజస్విని అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా శాఖలలో ప్రతిభ కనబరచిన మహిళలకు ఉత్తమ పురస్కారాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అందజేశారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖాధికారిని చేత ఉద్యోగినులను సత్కరించి అవార్డులను అందజేశారు. ఉత్తమ మహిళా ఉద్యోగినిగా అవార్డును అందుకోవడం వరుసగా రెండవసారి కావడంతో కామారెడ్డి, నిజామాబాద్ రెవిన్యూ విభాగం మహిళలు అభినందనలు తెలిపారు.