Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 June 2025, 7:31 pm Posted by : ramakrishna

రెవెన్యూ సదస్సులో పాల్గొన్న తహసీల్దార్

బతుకమ్మ, బోధన్ : నిజాంబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో సోమవారం భూ సమస్య పరిష్కార విధానంలో భాగంగా రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో విఠల్  మాట్లాడుతూ భూ సమస్యలు ఎవరికైనా ఉంటే నిజమైన అర్హులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్ చేసుకుని వెసులుబాటు కల్పిస్తుందని  దరఖాస్తులు చేసుకోవాలని పాసుబుక్కులో సర్వే నెంబర్ల సవరణ మిస్సింగ్ సాదాబైనా మా కనుగోలు  పాస్ బుక్ లో పేర్లు గాని నెంబర్ తప్పుగా ఉన్న గాని ప్రభుత్వం పరిశీలించి తద్వారా భూ సమస్యను పరిష్కరించబడతాయని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్ ఐ గంగాధర్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ గంగాధర్,  రెవెన్యూ సిబ్బంది, గ్రామ పెద్దలు,  నారాయణరెడ్డి, మేడి రవి,  కృష్ణారెడ్డి,  పోతారెడ్డి,  సుదర్శన్,  మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి, బాలాజీ, సాయిలు, గంగాధర్, అశోక్,  పోశెట్టి, అబ్బయ్య, సత్యంరెడ్డి, మహేష్   రాజు,  వేణుగోపాల్, ఒడ్డెన్న, తిరుపతి రెడ్డి,  లింగయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.