కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్ బాలయ్య

  ఇందల్ వాయి, బతుకమ్మ   ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందల్ వాయి మండల తహసీల్దార్ బాలయ్య శనివారం స్టేషన్ తాండ, జికే తండా, డొంకల్ గ్రామాలలో జరుగుతున్న ప్యాడి, కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఇన్ చార్జులు చూసుకోవాలని సూచించారు. లారీల కొరత ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎండలు ఎక్కువ ఉన్నందున రైతులు కొనుగోలు కేంద్రాలలో జాగ్రత్తగా ఉండాలని, కొనుగోలు కేంద్రాలలో నీరు, నీడ తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు...