పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మండలం పోచారం తండా, రాంపూర్ తండాల్లో తీజ్‌ పండుగ ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బంజారా సోదర సోదరీమణులకు పోచారం శ్రీనివాసరెడ్డి తీజ్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బంజారా మహిళలు సంప్రదాయ పద్ధతిలో పెంచిన గోధుమ గడ్డి బుట్టలను (తీజ్‌) ఎత్తుకుని నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి పోచారం ఉత్సాహంగా నృత్యం చేస్తూ...