Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 9:34 pm Posted by : ramakrishna

టీయూలో కొనసాగుతున్న తీజ్ ఉత్సవాలు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలో ఏడవ  రోజు తీజ్ ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సేవాలాల్ మహారాజ్ వారసులు నరసింహ ఆచార్య తో పాటు డాక్టర్ రమేష్ నాయక్  మాట్లాడుతూ తీజ్ పండుగ యొక్క సంస్కృతులను అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ బోధనలు గుర్తు చేశారు. అదేవిధంగా ప్రజలందరికీ చదువుతున్న విద్యార్థులకు కూడా కలిసిమెలిసి ఉండాలని  వారు కోరారు. అదే విధంగా యూనివర్సిటీ గిరిజన శక్తి అధ్యక్షుడు శీను రాథోడ్ సమాజంలో సేవాలాల్ మహారాజ్ వారసత్వాన్ని వారి యొక్క ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో  బంజారా యువతులు ఎన్ఎస్యూఐ యూనివర్సిటీ అధ్యక్షులు సాగర్ నాయక్ సచిన్, మోహన్,రాము, యువ రైటర్ రాజు తదితరులు పాల్గొన్నారు.