Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 August 2025, 5:26 pm Posted by : ramakrishna

తెయూలో ముగిసిన తీజ్ ఉత్సవాలు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన తీజ్ వేడుకలు తొమ్మిది రోజులు జరిగినాయి. బంజారా ఆడబిడ్డలు తొమ్మిది  రోజులు ఉపవాస దీక్షలు పాటించి, తీజ్ యాడి పై ప్రత్యేకంగా భక్తి శ్రద్ధతో మూడు పూటలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. 9 రోజులు ఒక్కొక్క కార్యక్రమంతో పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా రోజు భోగ్ భండార్ కార్యక్రమం జరిగింది. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అందరి సహకారంతో ఘనంగా తీజ్ ఉత్సవాలు ముగిశాయి. తీజ్ పండుగ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా బంజారా ఆడబిడ్డలకు మంచిగా ఉండాలని, మంచి వరుడు వాళ్లకు దేవుడు ప్రసాదించాలని, పొలాల్లో పాడిపంటలు పండాలని, అందరికీ సేవాలాల్ మహారాజ్, మేరామ యాడి ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ మా పై దీవించాలని, ఒక నమ్మకమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరూ తీజ్ పోగ్రామ్ లో పాల్గొని తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహించుకున్నారు.  తీజ్ నిమజ్జనం కార్యక్రమంలో రమేష్ గిరి మహారాజ్, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు సాగర్ నాయక్,  ప్రొఫెసర్లు కిరణ్ రాథోడ్, శాంతాబాయి , నాన్ టీచింగ్ స్టాప్, బికోజి ,నరేష్ మహావీర్,  మరియు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, బంజారా ఆడబిడ్డలు పాల్గొన్నారు.

Teej celebrations conclude in Teyu