Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 5:34 pm Posted by : ramakrishna

ఇన్వెస్టిగేషన్ లో టెక్నాలజీ ని ఉపయోగించుకోవాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతీ కేసు ఇన్వెస్టిగేషన్ లో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని, పద్ధతులను పోలీస్ సిబ్బంది ఉపయోగించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మంగళవారం సీపీ టౌన్ 3 పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ లు నిర్వహించారు. పోలీస్ విభాగము నిర్విరామముగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు అందజేశారు. టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని రికార్డ్ లను పరిశీలిస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచనలు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాల జరుగుతున్నాయని,  సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలో, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.

 

Technology should be utilized in investigations.

 

పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని కాలనీలల్లో పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై కాలనీలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసి, ఆ కాలనీలల్లో ఉన్నటువంటి సమాచారము తమపై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలి అన్నారు. ఈ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ నగరంలో ఉన్నందున వేరే ప్రాంతాలనుండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారిపై నిఘా వ్యవస్థ పటిష్ట పరిచి చుట్టూ ప్రక్కల పోలీసు సిబ్బందితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆదేశాలు జారిచేసారు. ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ,  సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ  అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసము యువతను ఎల్లప్పుడూ చైతన్యవంతులను చేయాలని, అన్ని ప్రాంతాలలో డ్రగ్స్ వాడకం నిషేధం అని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది 24X7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, సిబ్బంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని,  ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. సీపీ వెంట నిజామాబాద్ ఏ.సి.పి ప్రకాష్ యాదవ్, టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, టౌన్ 3 ఎస్.ఐ ఎ. హరిబాబు,  ఎస్.ఐ.2 నారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

 

Technology should be utilized in investigations.