Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2025, 2:00 pm Posted by : ramakrishna

నేరాల ఛేదనలో టెక్నాలజీ కీలకం

హైదరాబాద్,బతుకమ్మ : డీజీపీ జితేందర్ పదవీ విరమణ కార్యక్రమాన్ని మంగళవారం తెలంగాణ పోలీసు అకాడమీలో ఘనంగా నిర్వహించారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సైబర్ క్రైం,నార్కోటిక్స్ పై కఠిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా తన  తల్లిని గుర్తు తెచ్చుకొని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.   నేరాల ఛేదనలో టెక్నాలజీ కీలకమన్నారు. బెట్టింగ్ యాప్ పై లోతుగా దర్యాప్తు చేపట్టమన్నారు. ఈకార్యక్రమానికి నూతన డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, బుధవారం నూతన డీజీపీగా  శివధర్ రెడ్డి  పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.