ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి పశ్చిమబెంగాల్ లోని సిలిలగురి ( బాగ్ డోగ్రా) వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ టేకాఫ్ ను నిలిపివేసి విమానాన్ని సురక్షితంగా తిరిగి టెర్నినల్ కు తరలించారు. పైలట్ సమయ స్ఫూర్తితో కారణంగా పెద్దప్రమాదం తప్పింది. ఆవిమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు.