స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్, బతుకమ్మ : స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా పైలట్ సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన ఫ్లైట్ శంషాబాద్‍కు తిరుగు పయనమైంది. తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు తిరిగి శంషాబాద్ రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.