సాంకేతిక సైబర్ నేరాలను పసిగట్టాలి
బతుకమ్మ, మద్నూర్: సైబర్ నేరాలను పసిగట్టాలని కామారెడ్డి పోలీసు కళాబృందం కళాకారులు ఎమ్మెస్ ప్రభాకర్, మద్నూరు ఏఎస్ఐ సుధాకర్, బాన్సువాడ షీ టీం కానిస్టేబుల్ ప్రియాంక లు అన్నారు. మద్నూరులోని తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం జూనియర్ కళాశాలలో కామారెడ్డి పోలీసు కళాబృందంవారిచే సాంకేతిక సైబర్ నేరాలపై, షీ టీం గురించి, డ్రగ్స్, ట్రాఫిక్ పోలీసు రూల్స్ గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజంలోని యువత సైబర్ నేరాలను పసిగట్టాలని, ఇంట్లో తల్లిదండ్రులకు, అక్కాచెల్లెళ్లకు అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు....