Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 May 2025, 3:43 pm Posted by : ramakrishna

టేకు కలప స్వాధీనం

  • పంట పొలాల్లో అక్రమంగా నిలువ

Teak wood seized

వర్ని, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రామ శివారు లోని పంట పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 25 టేకు దుంగలను ఆదివారం ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ రైతు అటవీ ప్రాంతంలోని చెట్లను నరికి తన పంట పొలాల్లో దర్జాగా నిల్వ ఉంచారు.  ఈ నిల్వను ఓ మాజీ ప్రజాప్రతినిధి చేసినట్ల తన ఇంట్లో కూడా కొన్ని టేకు కలప దుంగలు దాచినట్లు విశ్వనీయ సమాచారం. ఈ విషయం సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరించారని ఆరపణలు ఉన్నాయి. అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో స్థానికుల ఫిర్యాదుతో పంట పొలాలలో నిల్వ ఉంచిన టేక్ కలపను పారెస్ట్ రేంజ్ అధికారి గంగాదర్ ఆదేశాల మేరకు సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ రమేష్ రెడ్డి వెళ్లి పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. వర్ని మండలం  జాకోరా, జలాల్పూర్, లక్ష్మాపూర్, పైడిమల్లి వివిధ గ్రామాల్లో అటవీ ప్రాంతంలో దర్జాగా కలపను  నరుకుతున్న చూసి చూడనట్టు వివరించడంపై అటవీ శాఖ అధికారులపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రజాప్రతినిధి ఇంటిలో, వ్యవసాయ క్షేత్రాల వద్ద ట్రాక్టర్ల కొద్ది కలపను అక్రమంగా నిలువ ఉంచినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా తరలించి అమ్ముకునేందుకు సిద్దం చేశారని గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Teak wood seized