ప్రణాళికాబద్దంగా బోధించాలి

నిజామాబాద్, బతుకమ్మ: పరీక్షల సమీపిస్తున్న నేపథ్యంలో పదో తరగతిలో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్ లతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా వారిని సన్నద్ధం చేయాలని, ప్రణాళికాబద్ధంగా బోధించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. అన్నం, కూరలతో పాటు పాఠశాలలకు కేటాయించిన బియ్యం నిల్వలు, కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. భీమ్ గల్ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసిన దుప్పట్లు, కాస్మొటిక్ కిట్ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు....