ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలి : డిటీఎఫ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలని డిటిఎఫ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఉపాధ్యాయులు విజయవంతంగా చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టి సుమారు 6 నెలలు కావస్తున్న నేటికి సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించలేదని అన్నారు. ఒక్కో ఉపాధ్యాయునికి 10 వేల రూపాయలు  రెమ్యూనరేషన్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈపాటికే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో రెమ్యూనరేషన్ చెల్లించారని తెలిపారు. కానీ నిజామాబాద్ లో...