నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలని డిటిఎఫ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఉపాధ్యాయులు విజయవంతంగా చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టి సుమారు 6 నెలలు కావస్తున్న నేటికి సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించలేదని అన్నారు. ఒక్కో ఉపాధ్యాయునికి 10 వేల రూపాయలు రెమ్యూనరేషన్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈపాటికే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో రెమ్యూనరేషన్ చెల్లించారని తెలిపారు. కానీ నిజామాబాద్ లో నేటికీ చెల్లించబడలేదన్నారు. తక్షణమే జిల్లా పాలనాధికారి స్పందించి సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు తక్షణమే రెమ్యూనరేషన్ చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం.బాలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఓమాజి, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.పెంటన్న పాల్గొన్నారు.