Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2024, 5:57 pm Posted by : ramakrishna

విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేసిన తర్వాతనే నూతన పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టీ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏఓ ప్రశాంత్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ జీఓ No. 25 ను సవరించిన తర్వాతనే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని అన్నారు. బదిలీలు, పదోన్నతుల అప్పీళ్లను సానుకూలంగా  పరిష్కరించాలని తెలిపారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయులు ఉండాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని అన్నారు. తరగతికి ఒక టీచర్ ఉండాలని, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్, తెలుగు మీడియంలకు  వేరువేరుగా పూర్తి స్థాయి ఉపాధ్యాయులు ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిజామాబాద్ జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు డి. సత్యానంద్, సల్ల సత్యనారాయణ, పి. శాంతన్, వై. విజయ్ కుమార్, కె. ఒమాజీ, సుధాం, ఆర్. పెంటన్న, జి.గంగాధర్, కేసీ లింగం, ఎస్.జి.టి.యు. జిల్లా నాయకులు ఎమ్. వెంకటరమణ, ఏ. గంగప్రసాద్, యూఎస్పీసీ సంఘాల ప్రతినిధులు, విజయ్ కుమార్, దాస్, కిషన్, చంద్రశేఖర్, ఇబ్రహీం, గంగాధర్, శ్రీనివాస్, లింగన్న,జనార్దన్, ఆనంద్, బాలకిషన్, గంగాధర్ పాల్గొన్నారు.

Teachers should be adjusted according to the number of students