Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 5:54 pm Posted by : ramakrishna

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

  • సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి
  • టిఎస్ యూటీఎఫ్  రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్

 

మోర్తాడ్, బతుకమ్మ: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టిఎస్ యూటీఎఫ్  రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్ డిమాండ్ చేశారు. బుధ వారం స్థానిక గర్ల్స్ హై స్కూల్లో టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం  నిర్వహించారు.ఈసందర్భం సత్యానంద్ మాట్లాడుతూ  ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, డిఏలను, బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సర్విస్ లోఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గత సంవత్సరం కులగనన చేసిన సర్వే రెమ్యూనరేషన్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంవత్సరం కాలం దాటిన ఇంకా ఇవ్వలేదు రెమినేషన్ను వెంటనే విడుదల చేయాలని,గురుకుల,కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఓ.రమేష్,ఉపాధ్యక్షులు మల్లేష్,శకుంతల మోర్తాడ్ మండల బాధ్యులు దండు గంగాధర్,బాలరాజు, పద్మ, తదితరులు పాల్గొన్నారు.