Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 8:13 pm Posted by : ramakrishna

తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

 

. . . పిఆర్ టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ‌

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీఆర్ టీయు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ‌అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఆర్ సి తక్షణమే అమలు పరచాలని, ఐదు పెండింగ్ డిఏలు, పెన్షనర్ బెనిఫిట్స్, నగదు రహిత వైద్యం, పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలన్నారు. వేసవి సెలవుల్లో ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని, సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు సమకూర్చాలని, పీఈటీలను నియమించాలని, ప్రతి సంవత్సరము డీఎస్సీ రిక్రూట్మెంట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.