పోలీస్ స్టేషన్ లకు పంతుళ్ల పంచాయితీలు
. వివాదాలతో సతమతమవుతున్న విద్యాశాఖ . మితిమీరుతున్న యూనియన్ ల జోక్యం నిజామాబాద్, బతుకమ్మ: పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు పంచాయితీలు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ ల మెట్లు ఎక్కుతున్నారు. ఉపాధ్యాయులపై అధికారులు అజమాయిషీ లేకపోవడంతో వరుస వివాదాలతో విద్యాశాఖ సతమతవుతోంది. హెడ్మాస్టర్లు, టీచర్లకు మధ్య విబేధాలు తారస్థాయికి చేరుతున్నాయి. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పాఠ్యాంశాల బోధన, విద్యార్థులను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించాల్సిన ఉపాధ్యాయులు అనవసర వివాదాల్లో తలదూరుస్తున్నారు. మొన్నటి వరకు ఎంఈవోల వ్యవస్థ ఉండగా.. ఇప్పుడు ప్రతి మండలానికి సీనియర్...