Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2024, 2:49 am Posted by : ramakrishna

ఏర్గట్లలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ సాధారణ ఉపాధ్యాయుడి నుండి క్రమశిక్షణగా ఉంటూ, సమాజానికి సేవ చేస్తూ దేశంలోని అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవిని పొందారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పిల్లలంతా, ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలను చక్కగా పాటిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మునిరుద్దీన్, పవన్, రాజశేఖర్, సమిత,S.శ్రీనివాస్, విజయ్ కుమార్, రాజేందర్, రాజనర్సయ్య, ఇందిరా, గంగాధర్, ప్రవీణ్ శర్మ, జ్యోతి పాల్గొన్నారు.

Teacher's Day is celebrated in Ergat