Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 September 2025, 5:38 pm Posted by : ramakrishna

ఉపాధ్యాయులే మార్గదర్శకులు

ముప్కాల్, బతుకమ్మ : విద్యార్థుల జీవితాల్లో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగులో నడిపించడానికి విద్యార్థుల ఉన్నతిని తమ ఉన్నతిగా భావించే నిస్వార్థ శ్రామికులు, విద్యార్థుల జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టి నిజమైన మార్గదర్శకులు ఉపాధ్యాయులని ముప్కాల్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని రేంజర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు చేసిన డాన్సులు అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులందరినీ విద్యార్థులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.