ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను రద్దు చేయాలి

నిజామాబాద్, బతుకమ్మ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపు, అభ్యాసనా సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులే బాధ్యత వహించాలని చెప్పిన అధికారులు.. ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఏక పక్షంగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ధర్మేందర్శ్రీకాంత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను లేకుండా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఏటేటా తగ్గిపోతోందని, ఈ సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపుకోసం కృషి చేద్దామని చెప్పిన విద్యాశాఖ అధికారులు...