Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2024, 9:55 pm Posted by : ramakrishna

విద్యార్థుల దాడిలో ఉపాధ్యాయుడు మృతి

రాయచోటి, బతుకమ్మ : విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడి చేయడంతో మృతి చెందిన ఘటన బుధవారం కడప జిల్లాలోని రాయచోటి లో గల కొత్తపల్లి జడ్ పీహెచ్ఎస్ ఊర్దూమీడియం పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు మరోక విద్యార్థి కలిసి ఇతర విద్యార్థుల మీద దౌర్జన్యం చేసిన సందర్భంలో వారిని ఉపాధ్యాయుడు అడ్డుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయుడి పై ఆ ముగ్గురు విద్యార్థులు  చెస్ట్ మీద, ముఖం మీద పిడి గుద్దులతో దాడికి పాల్పడ్డారు. కళ్ళద్దాలు కూడా విరిగిపోయిన పరిస్థితులలో మిగిలిన విద్యార్థులు విడిపించగా తీవ్ర ఆవేదనతో ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రిలో చేర్చారు. అయినప్పటికే ఉపాధ్యాయుడు కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.