Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2024, 4:08 pm Posted by : ramakrishna

వారికి సంతకం చేయడం నేర్పించాలని..

  • జిల్లాలో 1,32,592 మంది నిరక్షరాస్యులుగా గుర్తింపు
  • మొదటి దశలో 39,350 చదువు నేర్పాలని లక్ష్యం

బతుకమ్మ,మోర్తాడ్: గ్రామాల్లో పట్టణాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని గతంలో అక్షర కిరణం, సాక్షర భారత్ వంటి కార్యక్రమాలు గతంలో నిర్వహించి వాటి ద్వారా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అక్షరాలు నేర్పించి నిరక్షరాస్యత నిర్మూలన చేయాలని ప్రోగ్రామ్ లు నిర్వహించిన విషయం అందరికీ తెలిసింది. అదే విధంగా ప్రస్తుతం న్యూ ఇండియా లిట్రసి ప్రోగ్రాం (నవభారత అక్షరాశుల కార్యక్రమం) అనే పేరుతో నిరక్షరాశ్రుని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. దీనిపై బతుకమ్మ ప్రత్యేక కథనం.
నిజామాబాద్ జిల్లాలో..
2019 సంవత్సరంలో నిర్వహించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సర్వే ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలు, 4 పట్టణాలు (నిజామాబాద్, ఆర్మూర్, భీమ్ గల్, బోధన్) కలిపి మొత్తం 1,32,592 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే మొదటి దశలో జిల్లా లో 39,350 మందికి చదువు నేర్పించాలనే లక్ష్యం నిదేశించారు. జిల్లాలో ఉన్న అన్ని ఎంఈఓ లకు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు గ్రామాల్లోని ఉన్న నిరక్షరాశులు జాబితాను అందజేయడం జరిగింది.
చదువు నేర్పేది విద్యార్థులే..
నిరక్షరాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం ఈసారి నూతనంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు, చదువు నేర్చుకుని ఆసక్తి ఉన్న వ్యక్తులు, పదవి విరమణ పొందిన వ్యక్తులు. ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను నియమించి నిరక్షరాశులకు కనీసం వారి పేరు వారు రాసే విధంగా అలాగే వారి సంతకం వారు చేసేవిధంగా తయారు చేయాలని లక్ష్యముతో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
రాష్ట్రస్థాయిలో 3 రోజులు శిక్షణ..
ప్రభుత్వ పాఠశాల నుంచి ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులకు మూడు రోజులు రాష్ట్రస్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో శిక్షణ ఇచ్చి తద్వారా నిరక్షరాశులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దడం జరుగుతుంది.
నిరక్షరాస్యుల జాబితాను పంపించాం.
గోవింద్ రావు, డిప్యూటీ డైరక్టర్( వయోజన విద్య) నిజామాబాద్.
నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న మండల విధ్యాధికారులకు నిరక్షరాస్యుల జాబితాను గ్రామాల వారిగా నిరక్షరాశుల పేరు, ఫోన్ నెంబర్లతో సహా లిస్ట్ పంపించాం. ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు రాగానే అందరం సమిష్టి కృషితో లక్ష్యం చేరుకునే విధంగా పని చేస్తాం.