చిక్లి గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   చిక్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ సతీష్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ప్రజలకు ఎక్స్ రే, తెమడ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూమన్న మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి క్యాంపులు మరెన్నో జరిగే విధంగా చూస్తానని అన్నారు. అనంతరం ఉప సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ ఆరోగ్య...