Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 5:17 pm Posted by : ramakrishna

చిక్లి గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

చిక్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ సతీష్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ప్రజలకు ఎక్స్ రే, తెమడ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూమన్న మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి క్యాంపులు మరెన్నో జరిగే విధంగా చూస్తానని అన్నారు. అనంతరం ఉప సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎటువంటి విద్యార్హతలు లేని ఆర్ఎంపీలను, పీఎంపీలను ఆశ్రయించకూడదని సూచించారు. ఉప కేంద్రంలో ఏఎన్ఎం రాణి, ఎంఎల్ హెచ్ పి రేణుకా అందుబాటులో ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, మాక్లూర్ డాక్టర్ రవి శంకర్, జిల్లా టీబి కోఆర్డినేటర్ రవి గౌడ్, సూపర్వైజర్ ప్రమీల సోమశేఖర్, ఎంఎల్ హెచ్ పీ రేణుకా, రాణి, సువర్ణ, మంజుల, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

TB Mukt Bharat Abhiyan in Chikli village
TB Mukt Bharat Abhiyan in Chikli village
TB Mukt Bharat Abhiyan in Chikli village
TB Mukt Bharat Abhiyan in Chikli village