క్షయ రహిత భారత్ లక్ష్యంగా టీబీఎంబీఏ 2.0 మెగా ఉచిత ఆరోగ్య శిబిరం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : క్షయ రహిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా నిర్వహించిన టీబీఎంబీఏ 2.0 మెగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డా. రాజశ్రీ, జిల్లా క్షయ నియంత్రణ అధికారి (డీటీసీఓ) డా. దేవి నాగేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా 28వ వార్డు కార్పొరేటర్ మల్కాయి మహేందర్ నిక్షయ్ మిత్రగా క్షయవ్యాధి రోగులకు అందిస్తున్న సేవలను కొనియాడుతూ, డీఎంహెచ్‌ఓ డా. రాజశ్రీ, డీటీసీఓ డా. దేవి నాగేశ్వరి, ఎస్‌ఆర్ నగర్ యూపీహెచ్‌సీ...