Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 8:58 pm Posted by : ramakrishna

తాళ్ల రాంపూర్ లో తాటికొండ ప్రకాష్ భార్య మృతి

బతుకమ్మ,ఏర్గట్ల: విప్లవ పార్టీ సానుభూతిపరుడు తాటికొండ ప్రకాష్ సతీమణి లక్ష్మి, ఏర్గట్ల మండల పరిధిలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా వి ప్రభాకర్,అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి దేవారం, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ ఆర్మూర్ డిజన్ కార్యదర్శి ఎం ముత్తెన్న, టియుసిఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జి కిషన్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్, పిడి ఎస్ యు జిల్లా అధ్యక్షులు వి సత్యక్క, పి ఓ డబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు దేవేందర్ లు పార్టీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.