అక్రమంగా ఇసుక తరలిస్తున్న టాటా ట్రక్కుసీజ్

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఖాత్గావ్ గ్రామ శివారులోని మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టాటా  టక్కును సీజ్ చేసినట్లు బిచ్కుంద ఎస్ఐ  మోహన్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం  మేరకు ప్రకాష్, శేషారావు అనే ఇద్దరు  వ్యక్తులు ఇసుక అక్రమంగా  రవాణా  చేస్తున్నారని తెలిపారు. వాహనాలను పట్టకుని సీజ్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.