Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2024, 4:02 pm Posted by : ramakrishna

టాటా ఏస్ వాహనం బోల్తా

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని అండర్‌ 1 టౌన్‌ పరిధిలోని నెహ్రూ పార్క్‌ వద్ద బుధవారం టాటా ఏస్‌ నంబర్‌-టీఎస్‌ 18 టీ 7327 వాహనం బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే కూల్‌ డ్రింక్స్‌తో వెళ్తున్న ఆటో బుధవారం మధ్యాహ్నం తల్లీకూతుళ్లు, బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.

Tata Ace overturned

ఈ ఘటనలో తల్లికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి వన్ టౌన్ పోలీసులు చేరుకుని పరిశీలించారు. అయితే నెహ్రూ పార్క్ సర్కిల్‌లో మోచీలు కూర్చోవడమే దీనికి ప్రధాన కారణం అని స్థానికులు చెబుతున్నారు.

Tata Ace overturned