Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2024, 5:41 pm Posted by : ramakrishna

టాటా ఏస్ ఢీకొని మహిళ మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని నెహ్రూ పార్క్ వద్ద బుధవారం టాటా ఏస్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. సారంగపూర్ గ్రామానికి చెందిన పల్లె సవిత(52) బీడీలు చుట్టుకుంటూ జీవనం సాగిస్తుంది. పని నిమిత్తం ఆమె బుధవారం నగరానికి వచ్చింది. నగరంలోని నెహ్రూ పార్క్ వద్ద రోడ్డు దాటుతుండగా టీఎస్ టీ7327 నంబరు గల టాటా ఏస్ డ్రైవర్ అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పల్లె సవితకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆమెను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి భర్త నర్సాగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tata Ace collided with a woman and died