Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2024, 6:11 pm Posted by : ramakrishna

తస్మా జాగ్రత్త

బతుకమ్మ, మోర్తాడ్:  వర్షా కాలం ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ నీటి ద్వారా వచ్చే వ్యాధులను కూడా తీసుకువస్తుంది. వాతావరణ మార్పులతో ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు ఎండలు కొడతాయో తెలియని పరిస్థితి. ఇదే తరహాలో వ్యాధులు ఎప్పుడు విజురింబిస్తాయో తెలియని పరిస్థితి.
సీజనల్ వ్యాధిలే కొందరికి ప్రమాదకరం..
వర్షాకాలంలో డెంగ్యూ, నిమోనియా, మలేరియా, చికెన్ గున్యా, కలరా, వైరల్ ఫీవర్, స్టమక్ ఇన్ఫెక్షన్ ఇటువంటి ఎన్నో విజృంభిస్తుంటాయి. చాలా వరకు ఇవి మామూలుగా తగ్గిపోయే సీజనల్ వ్యాధులే అయినా కొందరికి ప్రమాదకరంగా మారొచ్చు. మధు మేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడే వారికి వృద్ధులకు, పిల్లలకు, గర్భిణులకు కొన్నిసార్లు ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. కాబట్టి వాన కాలంలో దోమలు విజృంభణ బెడద నుంచి బయటపడడానికి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం. కనీస జాగ్రత్తలు తప్పనిసరి. ఈ కాలంలో వాతావరణం మారడమే కాదు. కలుషితమయే నీరు ముసురుకొచ్చే దోమల దండుతో వచ్చే జబ్బులు చాలా ఎక్కువ పైగా ఇప్పటికీ ఉన్న కొన్ని జబ్బులు తీవ్రం కావచ్చు.
ఆగస్టు నెలలోనే 36 కేసులు..
ఆర్మూర్ డివిజన్ పరిధిలో మొత్తం 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆర్మూర్ డివిజన్లో ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 70 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం జనవరి నుండి జూలై నెల వరకు 34 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కానీ కేవలం ఆగస్టు ఒక్క నెలలోనే 36 కేసులు నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
పరిసరాల పరిశుభ్రత ముఖ్యం
రమేష్ (డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ) పోచంపాడ్.
ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమల బెడద పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. పారిశుద్ధ నిర్వహణ పనులు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము.