హైదరాబాద్, బతుకమ్మ : రూ.3 వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని రూ.2 కోట్లు తీసుకొని వదిలేసిన టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక నేరస్తుడిని ముంబయిలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా, రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకొని టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ శ్రీకాంత్ వదిలేశారు. నిందితుల నుంచి తీసుకున్న రూ.2 కోట్లను పైఅధికారులకు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాంత్‌తో పాటు అధికారుల పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు.