Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2025, 10:54 pm Posted by : ramakrishna

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

  • ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ ఇన్స్ పెక్టర్ రవికుమార్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. బోధన్ రూరల్ మండలంలోని ఫతేపూర్ గ్రామ శివారులో సాలూర గ్రామానికి చెందిన ఇలియాజ్ పేకాట స్థావరం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు బుధవారం రాత్రి దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,30,680 నగదు, 5బైకులు, 9సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని తదుపరి చర్యల నిమిత్తం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. రైడ్ చేసిన వారిలో నిజామాబాద్ సీసీఎస్ సీఐ రవికుమార్, ఎస్ఐ విట్టల్,  హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్స్ సుభాష్, నరేష్ పాల్గొన్నారు.