Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 7:26 pm Posted by : ramakrishna

చైనా మాంజా షాప్ లపై టాస్క్ ఫోర్స్ దాడులు

  • ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రూ. 15 వేల విలువైన చైనా మాంజా స్వాధీనం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైనా మాంజా అక్రమ విక్రయాలపై టాస్క్ ఫోర్స్, సిసిఎస్ పోలీసుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు చూసీ చూడనట్లు ఉండటంతో ప్రజల, పక్షుల ప్రాణాలతో చెలగాటమాడే చైనా మాంజా విక్రయాలు జిల్లా కేంద్రంలో బహిరంగంగా సాగుతుంది. నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సిందూశర్మ ఆదేశాల మేరకు సీసీఎస్, టాస్క్ ఫోర్స్ ఎసిపీ నాగేంధ్ర చారీ, టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య ఆధ్వర్యంలో రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు కైట్ షాపులపై మంగళవారం సాయంత్రం పోలీస్ సిబ్బంది దాడి చేశారు. చైనా మాంజాను విక్రయిస్తున్న అజం రోడ్డుకు చెందిన ఎండి ఆశ్రఫ్, మాలపల్లికి చెందిన ఎండి హైమద్ ఆలీలను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ధ నుంచి రూ.15 వేల విలువైనా చైనా మాంజా జబిన్ లను స్వాధీనం చేసుకుని వారిని, స్వాధీనం చేసుకున్న మాంజాను రెండవ టౌన్ పోలీసులకు తదుపరి చర్యలకు అప్పగించారు.

Task force raids on China Manja shop